మహిళాభ్యున్నతి ప్రదాత పూలే

ABN , First Publish Date - 2020-11-29T04:46:26+05:30 IST

మహిళలు పురుషులతో పాటు సమానంగా చదువుకోవాలని, తన ఇంటినుంచే మహిళలకు అక్షరాలు నేర్పి మహిళాభివృద్ధికి మహాత్మా జ్యోతిరావుపూలే పునాదులు వేశారని, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు డీఆర్‌డీవోలు శిరీష, జయశ్రీ పేర్కొన్నారు.

మహిళాభ్యున్నతి ప్రదాత పూలే
పూలమాలలువేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జ్యోతీరావు పూలే వర్ధంతి

మహనీయుడి సేవలను కొనియాడిన వక్తలు

ఖమ్మం సంక్షేమవిభాగం, నవంబరు 28: మహిళలు పురుషులతో పాటు సమానంగా చదువుకోవాలని, తన ఇంటినుంచే మహిళలకు అక్షరాలు నేర్పి  మహిళాభివృద్ధికి మహాత్మా జ్యోతిరావుపూలే పునాదులు వేశారని, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు డీఆర్‌డీవోలు శిరీష, జయశ్రీ పేర్కొన్నారు. శనివారం ఖమ్మం సంక్షేమభవన్‌లో మహాత్మా పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావుపూలే, సావిత్రీభాయి పూలే చిత్రపటా లకు పూలమాలు వేసి మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏవో రమేశ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ పర్యవేక్షకులు శంకర్‌, డీపీఎం అంజనేయులు, ఏపీఎం లక్ష్మణ్‌రావు, రేవతి, శ్రీమన్నారాయాణ, శ్రీనివాస్‌, రాజేశ్‌, చందు, రమేశ్‌, సతీష్‌, విష్ణు, మీరా, నరేశ్‌, గోపీలాల్‌, సర్వతి, వెంకట్‌, నవీన్‌, రవి, రాయప్ప, ఉజ్వల, ప్రసాద్‌, విజయ్‌, వెంకన్న, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

తిరుమలాయపాలెం: మహాత్మా జ్యోతిరావుపూలే వర్ధంతి వేడుకల ను శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. కేవీపీఎస్‌, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా  ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకుడు  ఇజ్రాయేల్‌ మాట్లాడుతూ పూలే జాతిగర్వించదగిన మహనీయు డని అన్నారు. ఈకార్యక్రమంలో కేవీపీఎస్‌ మండల కార్యదర్శి సుందరయ్య, మహేష్‌, వీరబద్రం, ముత్తయ్య, లాజరు, కె.నాగేశ్వరరావు, నరేష్‌ పాల్గొన్నారు. 

ఖమ్మం చర్చికాంపౌండ్‌: మహాత్మా జ్యోతిరావుపూలే  వర్ధంతిని తెలంగాణ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని పూలేచౌక్‌లో తెలంగాణ బహుజన జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ కేవీ కృష్ణారావు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కులవివక్షను రూపుమాపి సమసమాజ స్థాపనకు కృషిచేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బానోతు బద్రునాయక్‌, అబ్దుల్‌రహమాన్‌, శ్రీనివాస్‌యాదవ్‌, నాగేంద్రనాయక్‌, అఖిల్‌, రవింద్రనాయక్‌, వికాస్‌, శ్రీనివాస్‌, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం చర్చికాంపౌండ్‌:  పూలే వర్ధంతిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడుపిండిప్రోలు రామ్మూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావుపూలే ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు.  జిలా ్లప్రధాన కార్యదర్శి కేసోజు రఘుబాబు, చిట్టోజు రమేష్‌, అనుమోలు సోమయ్య, రాపోలు రాంబాబు, పోతగాని రమణ కుమార్‌, చంద్రశేఖర్‌, రమేష్‌, సంజీవరావు, పిల్లలమర్రి వెంకటనారాయణ  పాల్గొన్నారు.

సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావుపూలే వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదండ్ల మోహన్‌రావు పూలే విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల ఆశాజ్యోతి పూలే అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా మైనారిటి సెల్‌ అధ్యక్షుడు షేక్‌ నిజాముద్దీన్‌, నాగేశ్వరరావు, రషీద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T04:46:26+05:30 IST