Abn logo
May 22 2020 @ 12:13PM

`చంద్రముఖి` సీక్వెల్.. జ్యోతిక స్పందన!

దాదాపు పదిహేనళ్ల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం `చంద్రముఖి`. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రజనీకాంత్ స్టైల్‌తోపాటు జ్యోతిక నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. 


`చంద్రముఖి`గా జ్యోతిక నటన అందరి ప్రశంసలూ అందుకుంది. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో జ్యోతిక కూడా నటించబోతోందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను జ్యోతిక ఖండించింది. ``చంద్రముఖి` సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందనే విషయమే నాకు తెలియదు. ఆ సినిమా కోసం ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేద`ని జ్యోతిక చెప్పింది. 

Advertisement
Advertisement
Advertisement