సాగి రామకృష్ణంరాజు మార్గ్‌గా జువ్వలపాలెం రోడ్డు

ABN , First Publish Date - 2022-06-26T06:08:24+05:30 IST

సాగి రామకృష్ణంరాజు మార్గ్‌గా జువ్వలపాలెం రోడ్డు

సాగి రామకృష్ణంరాజు మార్గ్‌గా జువ్వలపాలెం రోడ్డు
మాట్లాడుతున్న ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ

భీమవరం ఎడ్యుకేషన్‌, జూన్‌ 25: భీమవరం అడ్డవంతెన వద్ద నుంచి పెదఅమిరం రోడ్డు టర్నింగ్‌ వరకు గల జువ్వల పాలెం రోడ్డును సాగి రామకృష్ణంరాజు మార్గ్‌గా ఆదివారం నామకరణ చేస్తున్నారని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రటరీ ఎస్‌ఆర్‌కే నిశాంతవర్మ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, కలెక్టర్‌ ప్రశాంతి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేస్తారన్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల వ్యవస్థాపకుడు సాగి రామకృష్ణంరాజు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నుంచి మెటల్‌ కింగ్‌ అవార్డు అందుకున్నారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.జగపతిరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాదరాజు, ఉపాధ్యక్షులు పి.కృష్ణంరాజు, గోకరాజు రామరాజు, పాలకవర్గ సభ్యులు ఎస్‌వీ రంగరాజు, డాక్టర్‌ కేఎస్‌ విజయనర్సింహరాజు, సాగి సత్యప్రతీక్‌వర్మ, మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-06-26T06:08:24+05:30 IST