జూట్‌మిల్లు కార్మికుల సమస్యలపై స్పందించాలి

ABN , First Publish Date - 2021-02-24T05:34:21+05:30 IST

బొబ్బిలి శ్రీలక్ష్మి శ్రీనివాసా జూట్‌మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం స్పందించాలని కార్మిక పోరాట సమితి నాయకులు డిమాండ్‌ చేశారు.

జూట్‌మిల్లు కార్మికుల సమస్యలపై స్పందించాలి

బొబ్బిలి (రామభద్రపురం): బొబ్బిలి శ్రీలక్ష్మి శ్రీనివాసా జూట్‌మిల్లు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం స్పందించాలని కార్మిక పోరాట సమితి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా 400 మంది కార్మికుల బకాయిలు, గ్రాడ్యుటీ, పీఎఫ్‌ చెల్లించ లేదని, దీంతో కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారు రూ.9 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని, ఎన్నో సార్లు చర్చించినా ఫలితం లేదని తెలిపారు. ఈ బకాయిలు చెల్లించే వరకు ఈ నెల 24 నుంచి బొబ్బిలి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరాహారదీక్షలు చేపట్టి... కార్యాలయాన్ని ముట్టడి స్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు రెడ్డి వేణు, పప్పల రాజు, ఎస్‌.గోపి, సీఐటీయూ నాయకులు శంకరరావు, చిన్నారావు, అచ్యుతరావు, జగన్నాథరావు  పాల్గొన్నారు.

 

Updated Date - 2021-02-24T05:34:21+05:30 IST