కింగ్ మేకర్‌గా జగ్మీత్సింగ్ పార్టీ
టోరంటో, సెప్టెంబరు 21: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో మళ్లీ విజయాన్ని సాధించింది. అయితే.. చట్టసభలో ఆధిక్యాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. మరో రెండేళ్లు పదవీకాలం ఉన్నప్పటికీ.. ట్రూడో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లారు. కానీ ఆయన వ్యూహం ఫలించలేదు. 2019తో 157 స్థానాలను గెలుచుకున్న ఆయన పార్టీ, ఈసారి 156 స్థానాలకు పరిమితమైంది. 338 సీట్లున్న చట్టసభలో (హౌస్ ఆఫ్ కామన్స్) ఆధిక్యానికి 170 అవసరం. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లలో ఆధిక్యంలో ఉంది. భారత సంతతి వ్యక్తి జగ్మీత్ సింగ్‌కు చెందిన న్యూడెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 27 సీట్లు దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ కింగ్ మేకర్‌గా నిలవనుంది. మొత్తంగా 17మంది ప్రవాస భారతీయులు ఎన్నికల్లో గెలుపొందడం విశేషం.