జాతి వివక్ష వ్యతిరేక పోరుకు కెనడా ప్రధాని మద్దతు!

ABN , First Publish Date - 2020-06-06T21:43:04+05:30 IST

జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని శ్వేత‌జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపని ఉందతంపై అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ నిరసనలు

జాతి వివక్ష వ్యతిరేక పోరుకు కెనడా ప్రధాని మద్దతు!

ఒట్టావా: జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని శ్వేత‌జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన ఉదంతంపై అమెరికా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ నిరసనలు ప్రపంచ దేశాలకు విస్తరించాయి. బ్రిటన్, బ్రెజిల్, కెనడా సహా పలు దేశాల్లో జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. కెనాడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. నల్లజాతీయులకు సంఘీభావం తెలిపారు. ఒట్టావాలో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న ఆయన.. మోకాళ్లపై నిల్చుని జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి మద్దతు పలికారు. కాగా.. ఆయన మోకాళ్లపై నిల్చున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. జాతి వివక్ష వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపినందుకు జస్టిన్ ట్రూడోకు కృతజ్ఙతలు చెబుతున్నారు.


Updated Date - 2020-06-06T21:43:04+05:30 IST