వాల్మీకులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-09-28T05:48:25+05:30 IST

వాల్మీకులకు ఇచ్చిన హామీని నేరవేర్చేలా చర్యలు తీసుకుని, వారికి న్యాయం చే యాలని ఎమ్మెల్యే అబ్రహాం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కోరారు.

వాల్మీకులకు న్యాయం చేయాలి
వాల్మీకులతో కలిసి మంత్రికి వినతి పత్రం ఇస్తున్న అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

- గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్‌తో ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా/రాజోలి, సెప్టెంబరు 27 : వాల్మీకులకు ఇచ్చిన హామీని నేరవేర్చేలా చర్యలు తీసుకుని, వారికి న్యాయం చే యాలని ఎమ్మెల్యే అబ్రహాం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను కోరారు. నడిగడ్డ వాల్మీకులతో కలిసి అయన మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో గిరిజన శాఖ మంత్రిని కలిసి మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చినట్లు ఐక్య వాల్మీకీ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు క్యాతుర్‌ మద్దిలేటి తెలిపారు. కార్యక్రమంలో తిమ్మపూరం నారాయణ, శ్రీనివాసులు, ధనుంజయ, బైరాపురం రమణ, జగన్‌మోహన్‌నాయుడు, వేణు, నారాయణ, గోకులపాడు శ్రీని వాసులు, ఈరన్న, కృష్ణయ్య, రామానాయుడు, అంజనేయులు పాల్గొన్నారు. 


మినీ బస్‌డిపో ఏర్పాటు చేయాలి

అలంపూర్‌ చౌరస్తాలో మినీ బస్‌ డిపోను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అబ్రహాం కోరారు. మంగళవారం అయన హైదరాబాదులోని అర్టీసీ  కళాభవన్‌లో అర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ను, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జనార్‌లను కలిసి మాట్లాడారు.  


కళాశాల ఏర్పాటు చేయాలి

రాజోలి మండల కేంద్రంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అబ్రహాం కోరారు. మండల నాయకులు, కళాశాల సాధన సమితి ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన హైదరాబాదులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కళాశాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు పెద్దగంగిరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, నిషాక్‌, ప్రకాష్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు షాషావలి, మూగన్న, లక్ష్మీనారాయణ, దస్తగిరి, ఈశ్వరయ్య, గంగిరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి ఉన్నారు. 


పారిశ్రామికవేత్తకు సన్మానం

అయిజ : మండలంలోని సింధనూరు గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త మూలగుండం శివరామకృష్ణను ఎమ్మెల్యే అబ్రహాం సన్మానించారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో మంగళవారం ఎమ్మెల్యే అబ్రహాం కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి శివరామకృష్ణను ఘనంగా సన్మానించారు. 

Updated Date - 2022-09-28T05:48:25+05:30 IST