బాధితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T05:58:31+05:30 IST

మండలంలోని చిల్లకొండయ్యపల్లి వద్ద జరిగిన విద్యుత ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ధర్నా చేశారు

బాధితులకు న్యాయం చేయాలి
పరిటాల శ్రీరామ్‌ ధర్నా


పరిటాల శ్రీరామ్‌ ధర్నా  


తాడిమర్రి, జూన్‌ 30: మండలంలోని చిల్లకొండయ్యపల్లి వద్ద జరిగిన విద్యుత ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ధర్నా చేశారు. తాడిమర్రిలోని మరువపల్లి దారి, విద్యుత కార్యాలయం ఎదుట బాధితుల బంధువులు, టీడీపీ, కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.  నాసిరకం తీగలు వాడటం వల్లే ప్రమాదం జరిగిందని, దీనికి ప్రభుత్వం, విద్యుతశాఖ పూర్తిగా బాధ్యత వహించాలన్నా రు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కుర్చున్నారు. ధర్మవరం ఆర్డీఓ వరప్రసాదరావు ధర్నా వద్దకు చేరుకుని మీ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో  పరిటాల శ్రీరామ్‌ ధర్నా విరమించారు. అంతుకు మునుపు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ మండల కన్వీనర్‌ కూచిరాము, శేఖర్‌, ఎల్‌ నరేంద్రచౌదరి,  కమ్యూనిస్టు నాయకులు జంగాలపల్లిపెద్దన్న, పోలా రామాంజినేయులు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T05:58:31+05:30 IST