మిస్సింగ్‌ సర్వే నెంబర్ల రైతులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-06-30T05:45:15+05:30 IST

వ్యవసాయ భూములు ఉండి పొజిషన్లో ఉన్నప్పటికీ ధరణిలో మిస్సింగ్‌ సర్వే నెంబర్‌ కారణంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదని అలాంటి రైతులకు న్యాయం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌్‌షకుమార్‌ను కోరారు.

మిస్సింగ్‌ సర్వే నెంబర్ల రైతులకు న్యాయం చేయాలి

 సీఎ్‌స సోమేష్‌కు ఎమ్మెల్యే సండ్ర వినతి

సత్తుపల్లి, జూన్‌ 29: వ్యవసాయ భూములు ఉండి పొజిషన్లో ఉన్నప్పటికీ  ధరణిలో మిస్సింగ్‌ సర్వే నెంబర్‌ కారణంగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదని అలాంటి రైతులకు న్యాయం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌్‌షకుమార్‌ను కోరారు. బుధవారం ఆయన సీఎ్‌సను హైదరాబాద్‌లో కలిసారు. ఎమ్మెల్యే ధరణి సమస్యలను సీఎ్‌సకు వివరించారు. మిస్సింగ్‌ సర్వే నెంబర్‌ జతపరచటానికి ధరణి పోర్టల్‌లో మార్పులు చేయాలని కోరారు. తద్వారా పొజిషన్లో ఉన్న వారికి పట్టాదార్‌పా్‌సపుస్తకాలు ఇవ్వాలని కోరారు. డూప్లికేట్‌ సర్వే నెంబర్‌ను రద్దు చేసే అప్షన్‌ను ధరణిలో కల్పించాలని కోరారు. గతంలో ఇళ్ల స్థలాల కోసం కేటాయించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. 


స్టేట్‌ ర్యాంకర్లకు సండ్ర అభినందన


తల్లాడ: ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన తల్లాడ మండలం రెడ్డిగూడెంలోని క్రీస్తూజ్యోతి కళాశాల విద్యార్థులను పోన్‌లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అభినందించారు. జూనియర్‌ ఇంటర్‌ ఎంపీసీలో 466 మార్కులతో రాష్ట్రస్థాయి మూడోర్యాంకు సాధించిన షేక్‌.ఆరీఫా, బైపీసీలో 434మార్కులతో రాష్ట్రస్థాయి ఐదోర్యాంకు సాధించిన కె.వినోద్‌, ఈ.నేహా, సీఈసీలో 483మార్కులతో రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు సాధించిన వి.అక్షయ, విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపర్చేలా కృషిచేసిన కళాశాల ప్రిన్సిపాల్‌ పాదర్‌ ప్రాన్సీస్‌, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు.


Updated Date - 2022-06-30T05:45:15+05:30 IST