Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 20 Aug 2022 02:30:30 IST

శ్రీవారి సేవలో జస్టిస్‌ రమణ

twitter-iconwatsapp-iconfb-icon
శ్రీవారి సేవలో జస్టిస్‌ రమణ

తిరుమల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో జరిగిన అభిషేక సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ రవీంద్రబాబు, జస్టిస్‌ చక్రవర్తి, రిజిస్ర్టార్‌ జనరల్‌ జస్టిస్‌ లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత కూడా స్వామిని దర్శించుకున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.