TTD: శ్రీవారిసేవలో సుప్రీంకోర్టు సీజే

ABN , First Publish Date - 2022-08-20T01:16:16+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice NV Ramana) శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి

TTD: శ్రీవారిసేవలో సుప్రీంకోర్టు సీజే

తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (Justice NV Ramana) శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara swamy)ని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌తో కలసి తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం వేకువజామున అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ మహద్వారం వద్ద  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy), డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్వాగతం పలికారు. తర్వాత ఆలయంలో జరిగిన అభిషేక సేవలో జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆలయం ముందున్న అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు సమర్పించిన జస్టిస్‌ ఎన్వీ రమణ ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయన్‌, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయలక్ష్మి, జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ రవీంద్రబాబు, జస్టిస్‌ చక్రవర్తి, రిజిస్ర్టార్‌ జనరల్‌ జస్టిస్‌ లక్ష్మణరావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2022-08-20T01:16:16+05:30 IST