జస్టిస్‌ ఎన్వీ రమణకు అభినందనలు

ABN , First Publish Date - 2021-04-11T09:08:02+05:30 IST

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ అభినందనలు తెలిపింది.

జస్టిస్‌ ఎన్వీ రమణకు అభినందనలు

హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ తీర్మానం 


అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ అభినందనలు తెలిపింది. ఈ నెల 8న జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. మెజార్టీ సభ్యుల ఆమోదంతో పలు తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ మోడల్‌ బైలా్‌సను స్వీకరించారు. అలాగే అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వైవీ రవిప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జీఎల్‌ నాగేశ్వరరావు, సెక్రెటరీ జేయూఎమ్‌వీ ప్రసాద్‌ రాజీనామాలను తిరస్కరించారు. అసోసియేషన్‌ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పీటా రామన్‌ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2021-04-11T09:08:02+05:30 IST