అమ్మవారి సన్నిధిలో జస్టిస్ నాగార్జునరెడ్డి దంపతులు
విశాఖపట్నం, జనవరి 27: బురుజుపేటలో కొలువుదీరిన కనకమహాలక్ష్మి అమ్మవారిని ఏపీ ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి గురువారం దర్శించుకున్నారు. ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి వి.రాంబాబు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి విశేష పూజల అనంతరం వేదాశీర్వచనం నిర్వహించి ప్రసాదం అందజేశారు.