ఇకపై అందరికీ అందుబాటులో న్యాయం !

ABN , First Publish Date - 2022-08-13T04:56:24+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం నందలూరు కోర్టు ఆవరణలో మండల లీగల్‌ కమిటీ కం జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.లత ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టు ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు.

ఇకపై అందరికీ అందుబాటులో న్యాయం !
న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న జడ్జి లత

నందలూరు, ఆగస్టు 12: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం నందలూరు కోర్టు ఆవరణలో మండల లీగల్‌ కమిటీ కం జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.లత ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టు ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత న్యాయం పొందడం ప్రజల హక్కుఅని ప్రతి గ్రామంలో వలంటీర్ల ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిసాకతయన్నారు. తల్లిదండ్రులను పోషించడం వారి పిల్లల బాధ్యత అని, అలా పోషించ ని వారికి, మూడు నెలల జైలు శిక్ష లేదా 5వేల రూపాయల జరిమానా విధిస్తారని తెలియజేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై వాహనదారులకు అవగాహన కల్పించారు. విజ్ఞానాన్ని అన్ని వర్గాల చెంతకు చేర్చడంలో మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందలూ రు తహసీ ల్దారు ఉదయ శంకర్‌రాజు, పెనగలూరు తహసీల్దారు శ్రీధర్‌రావు, పుల్లంపేట తహసీల్దారు నరసింహ కుమార్‌, నందలూరు ఎస్‌ఐ మైనుద్దీన్‌, పుల్లంపేట ఎస్‌ఐ ప్రతాప్‌ రెడ్డి, మహిళా పోలీసులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, గ్రామ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T04:56:24+05:30 IST