జగన్‌తో చెప్పి నీ కష్టాలు తీరుస్తా: మాజీ జడ్జి ఆడియో టేప్ బట్టబయలు

ABN , First Publish Date - 2020-08-07T03:44:48+05:30 IST

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో...

జగన్‌తో చెప్పి నీ కష్టాలు తీరుస్తా: మాజీ జడ్జి ఆడియో టేప్ బట్టబయలు

అమరావతి: ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య ఆడియో టేప్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆడియో టేప్‌లోని గొంతు జస్టిస్ ఈశ్వరయ్యదేనని బెంగళూరుకు చెందిన ట్రూత్‌ల్యాబ్ నిర్ధారించింది. ఆ ఆడియో టేప్ ఏబీఎన్ చేతికి చిక్కింది. ఈ ఆడియోలో జస్టిస్ ఈశ్వరయ్య చెలరేగిపోయారు. అధికార పార్టీ తరపున ఈ మాజీ జడ్జి వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు. జగన్‌తో చెప్పి నీ కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ జడ్జిల సంగతి కూడా త్వరలోనే తేలుస్తామంటూ జస్టిస్ ఈశ్వరయ్య చెలరేగిపోయారు. హైకోర్టు జడ్జిపైనా ఫిర్యాదు చేయించింది కూడా తానేనంటూ గొప్పలు పోయారు.


ఈ సంభాషణ మాజీ జడ్జి ఈశ్వరయ్య, మాజీ జడ్జి రామకృష్ణ మధ్య జరిగినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ వంగాల ఈశ్వరయ్యను జగన్ సర్కార్ నియమించింది. ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మాజీ జడ్జి ఈశ్వరయ్య ఇలా మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-08-07T03:44:48+05:30 IST