కోర్టు విచారణలను ప్రజలు చూడగలగాలి : జస్టిస్ చంద్రచూడ్

ABN , First Publish Date - 2022-01-31T00:08:26+05:30 IST

న్యాయస్థానాల్లో జరిగే విచారణలను ప్రజలు చూడగలగాలని

కోర్టు విచారణలను ప్రజలు చూడగలగాలి : జస్టిస్ చంద్రచూడ్

న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో జరిగే విచారణలను ప్రజలు చూడగలగాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఏ న్యాయమూర్తి పనితనంపైన అయినా తీర్పు చెప్పాలంటే, ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుల సంఖ్యను, కేస్ డిస్పొజల్ రేటును మాత్రమే కాకుండా కోర్టు గదిలో ఆయన ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వర్చువల్ విధానంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఆదివారం మాట్లాడారు. 


బలరాం కే గుప్తా రాసిన పుస్తకాన్ని వర్చువల్ విధానంలో ఆదివారం ఆవిష్కరించిన సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, న్యాయమూర్తుల సమర్థతను నిర్ణయించడానికి వారు ఇచ్చిన తీర్పుల సంఖ్యను, కేస్ డిస్పొజల్ రేటును మాత్రమే కాకుండా కోర్టు గది నాలుగు గోడల మధ్య వారి ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రజలు చూడలేకపోతే, కోర్టులు చేపట్టే పనుల స్వభావాన్ని వారు అర్థం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. న్యాయ వ్యవహారాలు ప్రజలు చూడటానికి అనువుగా ఉంటే, న్యాయ వ్యవస్థకు ఆమోదయోగ్యతను కల్పించడం మాత్రమే కాకుండా జవాబుదారీతనమనే ప్రజాస్వామిక సిద్ధాంతం మరింత బలపడుతుందని తెలిపారు. 


Updated Date - 2022-01-31T00:08:26+05:30 IST