జస్టిస్‌ Chandruకు డాక్టర్‌ అంబేడ్కర్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-01-14T14:17:39+05:30 IST

సామాజిక న్యాయం కోసం, అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ప్రముఖులను ప్రభుత్వం ప్రతి యేటా పెరియార్‌, అంబేడ్కర్‌ అవార్డులతో సత్కరిస్తోంది. ఆ మేరకు 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులను

జస్టిస్‌ Chandruకు డాక్టర్‌ అంబేడ్కర్‌ అవార్డు

చెన్నై: సామాజిక న్యాయం కోసం, అట్టడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ప్రముఖులను ప్రభుత్వం ప్రతి యేటా పెరియార్‌, అంబేడ్కర్‌ అవార్డులతో సత్కరిస్తోంది. ఆ మేరకు 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులను ఎన్నికైన ప్రముఖుల పేర్లను సీఎం స్టాలిన్‌ శుక్రవారం ప్రకటించారు. సామాజిక న్యాయ విభాగంలో ద్రావిడ ఉద్యమ పరిశోధకులు, ప్రముఖ రచయిత కె.తిరునావుక్కరసుకు ‘తందై పెరియార్‌ అవార్డు’, ఇదే విధంగా ఆదిద్రావిడ, గిరిజనుల కోసం న్యాయ పోరాటం చేసి అన్ని వర్గాల ప్రశంసలందుకున్న మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె. చంద్రుకు డాక్టర్‌ అంబేడ్కర్‌ తమిళనాడు ప్రభుత్వ అవార్డు’ను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డుల కింద ఇచ్చే నగదు పురస్కారాన్ని లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచినట్లు ఆయన వెల్లడించారు. వీరిద్దరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో నగదు పురస్కారాలతోపాటు స్వర్ణ పతకాలను కూడా బహూ కరించనున్నట్లు స్టాలిన్‌ ఆ ప్రకటనలో వివరించారు.

Updated Date - 2022-01-14T14:17:39+05:30 IST