గురువును సన్మానించిన జస్టిస్‌ చంద్రయ్య

ABN , First Publish Date - 2022-01-17T07:00:48+05:30 IST

గురువును మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య సన్మానించారు. 1964లో ఆదిలాబాద్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ గ్రామంలో చదువుకునే రోజుల్లో తనకు సైన్స్‌ పాఠాలను మీలా జగదీశ్వర్‌ బోధించారు.

గురువును సన్మానించిన జస్టిస్‌ చంద్రయ్య
మీలా జగదీశ్వర్‌ను సన్మానిస్తున్న జస్టిస్‌ చంద్రయ్య

సూర్యాపేట అర్బన్‌, జనవరి 16: గురువును మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య సన్మానించారు.  1964లో ఆదిలాబాద్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ గ్రామంలో చదువుకునే రోజుల్లో తనకు సైన్స్‌ పాఠాలను మీలా జగదీశ్వర్‌ బోధించారు. సూర్యాపేటలోని జగదీశ్వర్‌ ఇంటికి  జస్టిస్‌ చంద్రయ్య శనివారం వచ్చారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తాను ఈ స్థాయిని  జీవితంలో గురువును మించిన దైవం ఉండదని అలాంటి శిష్యులు ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడు గురువుకు ఎన్నో కోట్ల ఆస్తులను కూడగట్టుకున్న వారవుతారన్నారు. ఈ సందర్భంగా  హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య. మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదన్నారు. ఒక వ్యక్తి ఎంత ఉన్నతికి ఎదిగిన అతని వెనుక ఒక గురువు నేర్పిన విద్య కారణమన్నారు. 




Updated Date - 2022-01-17T07:00:48+05:30 IST