న్యాయ సలహాలు ఉచితంగా పొందవచ్చు

ABN , First Publish Date - 2022-08-19T04:41:17+05:30 IST

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా పేదలు న్యాయ సేవలు, సలహాలు ఉచితంగా పొందవచ్చని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎం. శ్రీనివాసులు నాయక్‌ తెలిపారు.

న్యాయ సలహాలు ఉచితంగా పొందవచ్చు
మాట్లాడుతున్న న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు నాయక్‌

 న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు నాయక్‌

వెంకటాచలం, ఆగస్టు 18 : జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా పేదలు న్యాయ సేవలు, సలహాలు ఉచితంగా పొందవచ్చని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎం. శ్రీనివాసులు నాయక్‌ తెలిపారు. మండలంలోని చెముడుగుంట సమీపంలో ఉన్న జిల్లా కేంద్ర కారాగారంలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ఖైదీల యోగక్షేమాలు, కేసుల వివరాలు, భోజన వసతి, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఖెదీలు ఇక్కడి నుంచి  ఇళ్లకు వెళ్లాక కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ కే రాజేశ్వర రావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఏపీ కాంతారావు, జైలర్‌ రమేష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2022-08-19T04:41:17+05:30 IST