మారుమూల ప్రాంతాలకు సత్వర న్యాయం

ABN , First Publish Date - 2021-06-17T05:13:03+05:30 IST

సాంతికేక పరిజ్ఞానం ద్వారా మారుమూల ప్రాంతాలకు సత్వర న్యాయం అందించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ.హరికృష్ణభూపతి అన్నారు.

మారుమూల ప్రాంతాలకు సత్వర న్యాయం
ఆన్‌లైన్‌ ద్వారా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తులు

 సత్తుపల్లిలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం

ఖమ్మం లీగల్‌/సత్తుపల్లి, జూన్‌ 16: సాంతికేక పరిజ్ఞానం ద్వారా మారుమూల ప్రాంతాలకు సత్వర న్యాయం అందించవచ్చునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ.హరికృష్ణభూపతి అన్నారు. కరోనా నిబంధనలను అనుసరించి బుధవారం సత్తుపల్లి కోర్టులో న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. న్యూఢిల్లీ జాతీయ న్యాయ సేవాసంస్థ మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ఈ కేంద్రం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎక్కువ మందితో పాటు ఆదివాసీ ప్రాంతాలు, కూలీలు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు లబ్దిపొందేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ లీగల్‌ అసిస్టెంట్‌ అందుబాటులో ఉంటారని, దూర ప్రాంతాల్లోని వారికి న్యాయ సంబంద సమస్యలు ఉంటే సంప్రదించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తగిన విధంగా న్యాయసేవలు, న్యాయ సహాయం, సలహాలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో 4వ అదనపు జిల్లా జడ్జీ సీవీఎస్‌.సాయిభూపతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ జావేద్‌ పాషా, జ్యూడీషియల్‌ మేజిస్ర్టేట్లు కే.యువరాజ, శ్రావణస్వాతి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచూరీ సీతారామయ్యతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:13:03+05:30 IST