జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద

ABN , First Publish Date - 2021-07-25T12:54:33+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది....

జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద

మహబూబ్‌నగర్ : జూరాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుకుంది. ఎగువన వర్షాల వల్ల భారీగా వరద వస్తున్నది. దీంతో 41 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న రెండు మూడ్రోజులపాటు జూరాల ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


ప్రస్తుత నీటిమట్టం : 316.550 మీటర్లు 

ప్రస్తుత నీటి నిల్వ : 6.019 టీఎంసీలు

పూర్తిస్థాయి నీటిమట్టం : 318.516 మీటర్లు 

పూర్తి స్థాయి నీటి సామర్థ్యం : 9.657 టీఎంసీలు

ఇన్ ఫ్లో : 3,75,000 క్యూసెక్కులు

దిగువకు శ్రీశైలం వైపు నీటి విడుదల : 3,75,027 క్యూసెక్కులు

మొత్తం ఔట్ ఫ్లో : 3,76,918 క్యూసెక్కులు.

Updated Date - 2021-07-25T12:54:33+05:30 IST