అమ్మో.. ప్రమాదం!

ABN , First Publish Date - 2022-07-03T07:04:24+05:30 IST

కాకినాడ ప్రభుత్వ ఇంటర్‌ వృత్తి విద్యా కళాశాల నిర్మించి 135 సంవత్సరాలు దాటింది.

అమ్మో.. ప్రమాదం!
శిఽథిలావస్థకు చేరిన ఈ భవనాల్లోనే కాకినాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల తరగతుల నిర్వహణ

అధ్వానంగా కాకినాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలు

పడగొట్టేయాలని ఆదేశాలొచ్చినా అందులోనే తరగతుల నిర్వహణ

విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న వైనం


భానుగుడి (కాకినాడ), జూలై 2 : కాకినాడ ప్రభుత్వ ఇంటర్‌ వృత్తి విద్యా కళాశాల నిర్మించి 135 సంవత్సరాలు దాటింది. అయినా ఇప్పటికీ ఇంటర్‌, ఒకేషనల్‌ తరగతు లను అక్కడే నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారు. పైకి చూస్తే ఆహ్లాదకర వాతావరణం ఉన్నా లోపలకు వెళ్లి చూస్తే మాత్రం ఇక్కడకు ఎందుకు చేరామా అని విద్యార్థులు తలపట్టుకునేటట్టు ఉంటుంది. అంత అధ్వానంగా, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న కళాశాల భవనాల్లో నేటికీ వృత్తి విద్యా కోర్సులు, ఒకేషనల్‌ తరగతులను ఇక్కడే నిర్వహిస్తుండడం విశేషం. కళాశాలలో సుమారు 700 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉదయం సమయంలో ఇంటర్‌ విభాగాలకు, మధ్యాహ్నం ఒకేషనల్‌ వారికి తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంటర్‌ కళాశాలకు అక్కడ మరోచోట కొత్త భవన నిర్మాణం చేపట్టారు. ఈ సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యార్థులు అక్కడకు వెళ్తారు కానీ ఒకేషనల్‌ తరగతులు మాత్రం ఇక్క డే కొనసాగేలా సిబ్బంది చూస్తున్నారు. అయితే ఈ కళాశాల పూర్తిస్థాయిలో శిథిలమై పడిపోవడానికి సిద్ధంగా ఉండడంతో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ అధికారులు తక్షణం కళాశాలను పడగొట్టాలని గత సంవ త్సరం డిసెంబర్‌లోనే కళాశాల ప్రిన్సిపాల్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇంటర్‌ విభాగాలకు కొత్త కళాశాల ఏర్పా టుచేసిన అధికారులు ఒకేషనల్‌ తరగతులకు సంబంధించి మాత్రం ఇందులోనే విద్యను కొనసాగిస్తున్నారు. వర్షాకాలం కావడంతో ఈ కళాశాల పరిస్థితి దినదినగండంగా మార డంతో కొత్తగా చేరే విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల పరిస్థితి చూసి భయపడుతున్నారు. పిఠాపురం మహారాజా వారు కట్టించిన పురాతన భవనంలో ఇప్పటికీ తరగతుల నిర్వహణ కొనసాగించడం పట్ల విద్యార్థుల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్నట్టేనని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలో విద్యార్థుల ప్రాణాలనుపణంగా పెట్టొద్దని పలువురు కోరుతున్నారు. కొత్త భవనంలో ఇంటర్‌కు ఉదయం, ఒకేషనల్‌కు మధ్యా హ్నం యఽథావిధిగా కొత్త భవనంలోనే నిర్వహించుకునే అవ కాశమున్నా ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో మరి.


Updated Date - 2022-07-03T07:04:24+05:30 IST