అనంతపురం: లంచం తీసుకుంటూ ఏసీబీకి జూనియర్ లైన్‌మెన్ చిక్కాడు. గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు నుంచి రూ. 12000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జూనియర్ లైన్‌మెన్ రంగరాజు పట్టుబడ్డాడు. గుత్తిలో డబ్బులు తీసుకుంటుండగా జూనియర్ లైన్‌మెన్ రంగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.