Gachibowli : జూనియర్ ఆర్టిస్ట్‌ల కారు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!

ABN , First Publish Date - 2021-12-20T12:44:01+05:30 IST

జూనియర్ ఆర్టిస్ట్‌ల కారు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!

Gachibowli : జూనియర్ ఆర్టిస్ట్‌ల కారు ప్రమాదానికి అసలు కారణం ఇదే..!

  • ఫుల్‌ సౌండ్‌ మ్యూజిక్‌.. డ్యాన్స్‌


హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు 304/ఎ, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కారు డ్రైవర్‌ మృతి చెందగా, గాయాలతో బయటపడిన జూనియర్‌ ఆర్టిస్టు సాయిసిద్ధు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిద్ధూ ఎడమ భుజం బోన్‌ విరిగింది. మెడ వెనుక బలమైన గాయం కావడంతో లేవలేని స్థితిలో ఉన్నాడు. అతడు పూర్తిగా కోలుకున్నాక మరిన్ని వివరాలు సేకరిస్తామని పోలీసులు చెబుతున్నారు. 


కారులో వెళ్తున్న సమయంలో ఫుల్‌ సౌండ్‌లో మ్యూజిక్‌ వింటూ, వెనుక సీట్లో యువతులు డాన్స్‌ చేసుకుంటూ వెళ్లినట్లుగా సిద్ధూ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీరితో పాటు మద్యం తాగిన మరో జూనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రసాద్‌ కాలు ఫ్యాక్చర్‌ కావడంతో ఇంట్లోనే ఉండగా, మిగిలిన నలుగురూ కారులో బయలుదేరారు. ఒకటి రెండు చలాన్లు ఉంటేనే ట్రాఫిక్‌ పోలీసులు కారును కదలనివ్వరు. అలాంటిది నిన్న ప్రమాదం జరిగిన కారుపై 2018 నుంచి 15 చలానాలు  పెండింగ్‌లో ఉన్నాయి. రూ.14 వేలు చెల్లించాల్సి ఉంది. రహీం తనకు తెలిసిన ఫ్రెండ్‌ ద్వారా ఆ కారును అద్దెకు తీసుకున్నాడు.

Updated Date - 2021-12-20T12:44:01+05:30 IST