తొలి ఉద్యమకారుల జంగ్‌సైరన్‌

ABN , First Publish Date - 2021-10-09T06:31:26+05:30 IST

కేసీఆర్‌ ప్రభుత్వం 1969 ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తానని ఇవ్వకపోవడంవల్ల వారు ఆ ఆకాంక్ష తీరకుండానే తనువు చాలిస్తున్నారు. మోసపోయిన తొలి ఉద్యమకారులు ‘సై తెలంగాణ’ జంగ్ సైరన్ మోగించబోతున్నారు....

తొలి ఉద్యమకారుల జంగ్‌సైరన్‌

కేసీఆర్‌ ప్రభుత్వం 1969 ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తానని ఇవ్వకపోవడంవల్ల వారు ఆ ఆకాంక్ష తీరకుండానే తనువు చాలిస్తున్నారు. మోసపోయిన తొలి ఉద్యమకారులు ‘సై తెలంగాణ’ జంగ్ సైరన్ మోగించబోతున్నారు. ఉద్యమకారుల ఊసెత్తకుండా స్మారకస్తూపం పూర్తిచేయకుండా కేసీఆర్ ద్రోహం చేస్తున్నారు. నెక్లెస్ రోడ్డుకు ఇరువైపులా 1969 ఉద్యమకారుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనే డిమాండ్ ఏమైంది? ఉద్యమకారులకు పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడంలేదు? తెలంగాణలో అవినీతి, బంధుప్రీతి, భూకబ్జాలు పెచ్చరిల్లిపోయాయి. ఈ పాలన తీరు మార్చాలి. జనం చేతికి తెలంగాణ వచ్చేట్టుగా మళ్లీ ఉద్యమించాలి. సూర్యాపేట స్వర్ణోత్సవ మహాసభ ఆ భావి పోరాటానికి ప్రజలను కదిలిస్తుంది. ఈ నెల 10న సూర్యాపేటలోని అంజలి స్కూల్‌లో 1969 ఉద్యమ స్వర్ణోత్సవ రెండో మహాసభ జరగనున్నది. మాజీ మంత్రులు ఏ. చంద్రశేఖర్, పొన్నాల లక్ష్మయ్య, జస్టిస్ (రి) చంద్రకుమార్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొంటారు. 

ననుమాస స్వామి

అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ యోధుల ఫోరం

Updated Date - 2021-10-09T06:31:26+05:30 IST