Good news: బెంగళూరుకు త్వరలో జంబోజెట్‌ విమాన సేవలు

ABN , First Publish Date - 2022-08-18T17:52:24+05:30 IST

రాజధాని బెంగళూరు నగర కిరీటంలో మరో కలికితురాయి చోటు చేసుకోబోతోంది. దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం

Good news: బెంగళూరుకు త్వరలో జంబోజెట్‌ విమాన సేవలు

బెంగళూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగర కిరీటంలో మరో కలికితురాయి చోటు చేసుకోబోతోంది. దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలిసారి జంబోజెట్‌ విమాన సేవలు(Jumbojet flight services) ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30న దుబాయ్‌ నుంచి నేరుగా బెంగళూరుకు జంబోజెట్‌ విమాన సేవలు ఉంటాయని ఎమిరేట్స్‌ సంస్థ ప్రకటించింది. 2014 నుంచి ముంబై విమానాశ్రయం నుంచి ఎయిర్‌బస్‌ 380 జంబోజెట్‌ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో బెంగళూరు విమానాశ్రయం(Bangalore Airport) కూడా చేరుకోబోతోంది. జంబోజెట్‌ విమానంలో మూడు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ప్రీమియం క్లాస్‌, బిజినెస్‌ క్లాస్‌, ఎకానమీ క్లాస్‌తో కలిపి మొత్తం 853 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని ఎయిర్‌ ఎమిరేట్స్‌ సంస్థ నగరంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2022-08-18T17:52:24+05:30 IST