‘జూకంటి’కి పొట్లపల్లి రామారావు సాహిత్య పురస్కారం

ABN , First Publish Date - 2020-11-21T05:44:25+05:30 IST

సామాజిక సాహిత్య కళా రంగాల్లో పొట్లపల్లి వరప్రసాదరావు ఫౌండేషన్ చేస్తున్న కృషి తెలిసిందే. ఇందులో భాగంగా సుప్రసిద్ధ కవి, రచయిత, నాటక కర్త, స్వతంత్ర మేధావి, సామాజిక సంస్కర్త పొట్లపల్లి రామారావు ఆశయాలను....

‘జూకంటి’కి పొట్లపల్లి రామారావు సాహిత్య పురస్కారం

సామాజిక సాహిత్య కళా రంగాల్లో పొట్లపల్లి వరప్రసాదరావు ఫౌండేషన్ చేస్తున్న కృషి తెలిసిందే. ఇందులో భాగంగా సుప్రసిద్ధ కవి, రచయిత, నాటక కర్త, స్వతంత్ర మేధావి, సామాజిక సంస్కర్త పొట్లపల్లి రామారావు ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ‘పొట్లపల్లి ప్రచురణలు’ స్థాపించి రామారావు రచనల్ని తెలుగు సాహిత్య సమాజానికి అందజేసింది. దానికి కొనసాగింపుగా తెలుగులో ఉత్తమ సాహిత్యకారుల్ని గుర్తించి, ప్రోత్సహించి, గౌరవించాలనే సంకల్పంతో ‘పొట్లపల్లి రామారావు సాహిత్య పురస్కారం’ ఏర్పాటు చేస్తోంది. ప్రతి సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా నవంబర్ 20వ తేదీన ఒక సుప్రసిద్ధ సాహితీ వేత్తకు, ఒక యువ రచయితకు చెరో ఇరవై ఐదు వేల రూపాయల నగదుతో రెండు అవార్డులను అందజేయబోతున్నది.


2020 సంవత్సరానికి ఈ పురస్కారాన్ని ప్రముఖ కవి, కథకుడు జూకంటి జగన్నాథం (జీవన సాఫల్య పురస్కారం) గారికీ, ‘వ్యతిరిక్త ప్రవాహం’ కవితా సంపుటి రచయిత సత్యోదయ్ గారికీ ఇవ్వాలని నిర్ణయించాం. ప్రొ. జయధీర్ తిరుమలరావు, శ్రీ పొట్లపల్లి వరప్రసాదరావు, డా.ఎ. కె. ప్రభాకర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 


కె. రామకృష్ణారెడ్డి, పొట్లపల్లి ఆదిత్యరామ్

(పొట్లపల్లి వరప్రసాదరావు ఫౌండేషన్)

Updated Date - 2020-11-21T05:44:25+05:30 IST