రసవత్తరంగా కబడ్డీ చాంపియన్‌షిప్‌ టోర్నీ

ABN , First Publish Date - 2021-10-17T06:29:54+05:30 IST

స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో సీఎం కప్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్న 40 జట్ల క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడుతున్నారు.

రసవత్తరంగా కబడ్డీ చాంపియన్‌షిప్‌ టోర్నీ
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న డాక్టర్‌ వై.శ్రీనివాసరావు

విశాఖపట్నం(స్పోర్ట్సు), అక్టోబరు 16: స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో  సీఎం కప్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పాల్గొంటున్న 40 జట్ల క్రీడాకారులు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ హోరాహోరీగా తలపడుతున్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌లకు జీవీఎంసీ స్పోర్ట్సు డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు ముఖ్య అతిఽథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ సంఘం సంయుక్త కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు, జిల్లా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 

రెండో రోజు ఫలితాలు:

ఎస్‌ఎస్‌వీజేఎం నాయుడు జట్టు 39-28 పాయింట్లతో నర్సీపట్నం-బీపై, చంద్రంపాలెం 27-18 స్కోరు తేడాతో అనకాపల్లిపై, నర్సీపట్నం-ఏ 43-27 స్కోరు తేడాతో మరదపాలెంపై, భీమిలి 20-19 స్కోరు తేడాతో ఎం.పేటపై, అల్లూరి యూత్‌ 35-28 స్కోరుతో మధురవాడపై, ముసలినాయుడుపాలెం 40-32 స్కోరుతో రాధాకృష్ణ అగనంపూడిపై, పీహెచ్‌సీ చిట్టివలస 20-12 స్కోరుతో వైజాగ్‌ లయన్స్‌పై గెలుపొందాయి. 


Updated Date - 2021-10-17T06:29:54+05:30 IST