రసాభాసగా కౌన్సిల్‌

ABN , First Publish Date - 2021-12-01T05:51:14+05:30 IST

ప్రతీ నెల చివరి వారంలో జరిగే వనపర్తి మునిసిపల్‌ సాధారణ స మావేశం మంగళవారం చైర్మన్‌ గట్టు యాదవ్‌ అధ్య క్షతన నిర్వహించారు.

రసాభాసగా కౌన్సిల్‌
ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న అధికార పార్టీ కౌన్సిలర్లు

వనపర్తి టౌన్‌, నవంబరు 30: ప్రతీ నెల చివరి వారంలో జరిగే వనపర్తి మునిసిపల్‌ సాధారణ స మావేశం మంగళవారం చైర్మన్‌ గట్టు యాదవ్‌ అధ్య క్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రతిపక్షపాత్ర పోషించారు. దీంతో సమావేశం రసాభాసగా సాగింది. సాధారణం గా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిల్‌ సభ్యులు అధి కార పార్టీ సభ్యుల తీరుపై నిరసనలు తెలపడం, విమర్శలు చేయడం సర్వసాధారణం. అందుకు భి న్నంగా అధికారపార్టీ కౌన్సిల్‌ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషించారు. తమ వార్డుకు రెండు నెలలుగా చెత్త సేకరణ ట్రాక్టర్లు రావడం లేదని అధికార పార్టీకి చెం దిన కౌన్సిలర్లు ఉంగ్లం అలేఖ్య, నందిమల్ల భువనే శ్వరి నిరసన తెలిపారు.  ట్రాక్టరు మధ్యాహ్నం వస్తే అప్పటికే కాలనీవాసులు పనులపై బయటికి పోతు న్నారని, ట్రాక్టర్లు వచ్చినా ఫలితం లేకుండా పోతుం దని అన్నారు.  కాలనీ ప్రజలతో తీవ్ర వ్యతిరేకత వ స్తుందని కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తమ వార్డులోనే మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ల నివా సాలు ఉన్నాయని, ఇలాంటి వార్డుల్లోనే ఇలా ఉండే మిగతా వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 

మొక్కల లెక్కలు చెప్పాలి..

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఫ్లోర్‌లీడర్‌ బండారు రాధాకృష్ణ, బాపనిపల్లి వెంకటేష్‌లు సమావేశం ప్రా రంభంలోనే నేలపై కూర్చొని నిరసన తెలిపారు.  నా లుగు నెలలుగా హరితహారం మొక్కలపై సమాచా రం ఇవ్వడం లేదని మునిసిపల్‌ కమిషనర్‌ తీరును తప్పుబట్టారు. పట్టణ ప్రగతి నిధులలో నుంచి 10 శాతం రూ. 48 లక్షలు కౌన్సిల్‌ కమిటీ సభ్యులకు తెలియకుండా డ్రా చేశారని ఆరోపించారు. హరితహా రంలో భాగంగా మొత్తం ఎన్ని మొక్కలు తెచ్చారు.. అందులో ఎన్ని నాటారు.. వాటి సంరక్షణ కోసం ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు.. మొక్కల రక్షణ కోసం తీసుకున్న 20 మం ది కూలీలు ఎక్కడ పనిచేస్తున్నారని కమి షనర్‌ను ప్రశ్నించారు. స్వీపింగ్‌ యంత్రం ఎందుకు వినియోగించుకోవడం లేదని, శా నిటేషన్‌ విషయంలో పట్టణం పూర్తిగా దు ర్బరంగా మారిందని, వెంటనే 20 మంది కామాటీలను తీసుకోవాలని డిమాండ్‌ చే శారు. హరితహారం మొక్కల వివరాలు బుధవారం కౌన్సిల్‌ సభ్యులకు తెలియజే స్తామని కమిషనర్‌ హామీ ఇవ్వడంతో అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు శాంతించారు. 

ఏజెండా అంశాలు తిరస్కరణ..

నవంబరు నెలకు సంబంధించి 17 అంశాలను ఏజెండాలో పొందుపరిచారు. పెద్ద డ్రైనేజీలో సిల్ట్‌ తొలగింపు కోసం ఎక్స్‌కవేటర్‌ చార్జీ రూ. 5 లక్షల ఆం శాన్ని, ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వభూమి కేటాయిం పు ఆంశాన్ని, జనరల్‌ ఫండ్స్‌తో సీసీ, డ్రైనేజీల నిర్మా ణం కోసం పొందుపరిచిన పలు ఆంశాలకు కౌన్సిల్‌ ఆమోదం తెలపలేదు. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పాకనాటి కృష్ణ, విభూది నారాయణ, కంచె రవి, పుట్టపాకల మహేష్‌, మహిళ కౌన్సిలర్లు, మేనేజర్‌ ఖాజా, ఏఈ, అధికారులు ఉన్నారు.




Updated Date - 2021-12-01T05:51:14+05:30 IST