May 4 2021 @ 21:00PM

కరోనా ఎఫెక్ట్‌: తోటలోనే బాలీవుడ్‌ హీరోయిన్‌ నివాసం

కరోనా ఎఫెక్ట్‌తో ముంబైలోని వాడా ఏరియాలో ఉన్న తన తోటలోనే నివాసం ఉంటున్నానని తెలిపింది బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ జుహీ చావ్లా. ప్రస్తుతం ముంబైలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. అలాగే ఆక్సిజన్‌ కొరత కూడా ముంబైని వణికిస్తోంది. దీంతో ముంబైలోని పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ జుహీ చావ్లా మాత్రం ముంబై వాడా రోడ్‌లో ఉన్న తన తోటలోనే ఆఫీస్‌ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లుగా తాజాగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.


''వాడా ఫామ్‌లో మా కొత్త కార్యాలయం‌. ఇక్కడ గాలికి, ఆక్సిజన్‌కి ఎటువంటి లోటులేదు. కొత్తగా మేము గోశాల‌, స్టాఫ్‌కి క్వార్టర్స్‌ మరియు అధికంగా పండ్ల మొక్కలను నాటాలని ప్లాన్‌ చేస్తున్నాం.." అని జుహీ చావ్లా ట్వీట్‌ చేసి.. తోటలో కూర్చుని ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.