Jun 1 2021 @ 07:29AM

5జీ టెక్నాల‌జీపై కోర్టు మెట్లెక్కిన జూహీ చావ్లా

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ జూహీ చావ్లా 5 జీ టెక్నాల‌జీ అమ‌లుపై కోర్టును ఆశ్ర‌యించారు. దేశంలో 5జీ సాంకేతిక అమ‌లు కావ‌డంపై వ‌చ్చే రేడియో ధార్మిక‌త స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌ని, దీని వ‌ల్ల ప‌ర్యావ‌రణానికి ప్ర‌మాదం ఉంద‌ని జూహీ చావ్లా త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. సాంకేతికప‌ర‌మైన విష‌యాల‌ను వ్య‌తిరేకించ‌డం లేద‌ని, అయితే వైర్‌లెస్ సంబంధిత ప‌రిక‌రాల నుంచి ఏర్ప‌డే రేడియేష‌న్ ప్ర‌జ‌ల ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని జూహీ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కొత్త 5జీ టెక్నాల‌జీ మ‌నుషుల‌కు, జంతువుల‌కు హానిక‌రం కాద‌ని స‌ద‌రు ప్ర‌భుత్వ విభాగం నిర్దారించాల‌ని జూహీ డిమాండ్ చేశారు. 

Bollywoodమరిన్ని...