CJI NV Ramana: ఒక్క రాజ్యాంగానికే మేం జవాబుదారీ

ABN , First Publish Date - 2022-07-03T12:57:13+05:30 IST

న్యాయ వ్యవస్థ కేవలం రాజ్యాంగానికే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ‘‘ఆయా సంస్థలకు రాజ్యాంగం అప్పగించిన పాత్రను, బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన ఉంది. ప్రతీ ప్రభుత్వ చర్యను న్యాయవ్యవస్థ సమర్థించాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తుంది.

CJI NV Ramana: ఒక్క రాజ్యాంగానికే మేం జవాబుదారీ

అమెరికా పర్యటనలో సీజేఐ జస్టిస్‌ రమణ

న్యూఢిల్లీ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థ కేవలం రాజ్యాంగానికే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ‘‘ఆయా సంస్థలకు రాజ్యాంగం అప్పగించిన పాత్రను, బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన ఉంది. ప్రతీ ప్రభుత్వ చర్యను న్యాయవ్యవస్థ సమర్థించాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ ఉండాలని ఆశిస్తాయి. ప్రజల్లో  రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య సంస్థల కార్యకలాపాలపై అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తప్పుడు ఆలోచనలు వర్ధిల్లుతాయి. స్వతంత్ర సంస్థను దిగజార్చడమే లక్ష్యంగా ఇటువంటి ప్రచారం తీవ్రంగా వ్యాప్తి జరుగుతోంది. నేను స్పష్టం చేస్తున్నాను..న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ’’ అని వ్యాఖ్యానించారు. శాన్‌ ఫ్రాన్సిస్కోలో భారతీయ అమెరికన్ల సంఘం శనివారం జస్టిస్‌ రమణను సన్మానించింది. రాజ్యాంగంలో నిర్దేశించిన చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సె్‌సను అమలు చేయడానికి దేశం లో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయనీ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-07-03T12:57:13+05:30 IST