తప్పు చేస్తే జడ్జీలనూ జగన్‌ వదలరు

ABN , First Publish Date - 2022-01-22T09:12:09+05:30 IST

తప్పు చేస్తే న్యాయమూర్తులను కూడా సీఎం జగన్‌ రెడ్డి వదలరని మం త్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

తప్పు చేస్తే జడ్జీలనూ జగన్‌ వదలరు

  • సర్కారుపై ఉద్యోగులు అసభ్యంగా మాట్లాడొద్దు
  • అలా మాట్లాడితే హెచ్‌ఆర్‌ఏ వస్తుందా?
  • చిరంజీవితో కుశల ప్రశ్నలే.. సంప్రదింపులు కావు 
  • గుడివాడలో తప్పు జరిగుంటే చర్యలు: పేర్ని నాని


అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తప్పు చేస్తే న్యాయమూర్తులను కూడా సీఎం జగన్‌ రెడ్డి వదలరని మం త్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతామని, ప్రభుత్వంపై అసభ్యంగా మాట్లాడడం ఉద్యోగులకూ, ఉద్యోగసంఘాలకూ తగదన్నారు. ఎవరి మాటో వి ని అసభ్యంగా మాట్లాడవద్దని సూచించారు. పది మందికి విద్యాబుద్ధులు చెప్పాల్సిన వారు అసభ్యంగా మాట్లాడకూడదన్నారు. అసభ్యంగా మాట్లాడితే హెచ్‌ఆర్‌ఏ వస్తుందా అని ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియా తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలను సంప్రదింపులకు పిలుస్తున్నారని చెప్పా రు. ఉద్యోగులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కష్టాలుంటాయన్నారు. గత్యంతరం లేకనే పీఆర్సీపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 2020-21 ఆదాయం రూ.60,680 కోట్లు మాత్రమేనని తెలిపారు. ప్రత్యక్షంగా రావాల్సిన రూ.22,000 కోట్ల ఆదాయం తగ్గిపోయిందన్నారు.


కేంద్రం నుంచి రావాల్సిన డివల్యూషన్‌ ఆదాయం తగ్గిపోతుందన్నారు. ఐదేళ్ల లోపు వారికి మాస్క్‌ అవసరం లేదని కొన్ని ప్రమాణాలు చెబుతున్నాయంటున్నారని చెప్పారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి, జగన్‌కు మధ్య జరిగినవి సంప్రదింపులు కావని.. కుశల ప్రశ్నలు మాత్రమేనని చెప్పారు. సీఎం జగన్‌, చిరంజీవి మాట్లాడుకున్నవన్నీ బయటకు చెప్పలేదన్నారు. సినిమా వాళ్లు పార్టీ పెట్టినంత మాత్రాన తప్పు చేస్తే ప్రభుత్వం వదులుతుందా? అని ప్రశ్నించారు. గుడివాడలో నిజంగా తప్పు జరిగుంటే జగన్‌ చర్య తీసుకుంటారని చెప్పారు. గుడివాడకు టీడీపీ వాళ్లు ఎందుకు వెళ్లారని, నిజనిర్ధారణ చేయడానికి వాళ్లెవరని ప్రశ్నించారు. జోగి రమేశ్‌ కరకట్ట ఎక్కితే ఆయన కారు అద్దాలు పగులగొట్టారన్నారు. 

Updated Date - 2022-01-22T09:12:09+05:30 IST