Advertisement
Advertisement
Abn logo
Advertisement

నారసింహుని సన్నిధిలో న్యాయమూర్తులు

కదిరిఫీచర్స్‌, అక్టోబరు 14: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కర్నూ లుకు చెందిన జిల్లా న్యాయమూర్తులు ప్రత్యేక పూజా కార్యక్ర మాలు నిర్వహిం చారు. గురువారం కర్నూలు జిల్లా న్యా యమూర్తి వీ రాధాకృష్ణాకృపాసాగర్‌, ఎస్సీ, ఎస్టీ 6 వ అదనపు జిల్లా న్యా య మూర్తి వీ అనంతలక్ష్మీ సత్యవాణి దంపతులు ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారు. వారికి తూర్పు రాజగోపురం వద్ద ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మెన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, అధికారులు , పౌరోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని సన్మానించి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలను  బహూకరించారు. వీరి వెంట కదిరి కోర్టు సిబ్బంది, న్యాయవాదుల సంఘం అధ్యక్షు డు లింగాల లోకేశ్వ రరెడ్డి, ఏపీపీ రామ్మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement