ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం సందర్శించారు. కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చిన ఆమెకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని ఇచ్చి వేదాశీర్వచనం అందించారు. అనంతరం దేవస్థానం ఏఈవో రావిపాటి లక్ష్మణస్వామి శ్రీవారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు.