బాబ్రీ మసీదు కేసులో సంచలన తీర్పు

ABN , First Publish Date - 2020-09-30T17:56:42+05:30 IST

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేత కుట్రకాదని ... కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు.

బాబ్రీ మసీదు కేసులో సంచలన తీర్పు

లఖ్‌నవ్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేత కుట్రకాదని ... కూల్చివేతకు సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్‌కే యాదవ్ పేర్కొన్నారు. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు ఇవాళ వెలువడింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుగురు నిందితులు హాజరయ్యారు.  


బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును  కరసేవకులు కూల్చివేశారు. మొత్తం 48 మందిపై అభియోగాలు నమోదు కాగా.. దర్యాప్తు సమయంలో 17మంది మృతి చెందారు. 2009లో నివేదిక లిబర్హన్‌ కమిషన్ సమర్పించారు. మసీదు కూల్చివేత వెనుక కుట్ర ఉన్నట్లు కమిషన్ తేల్చింది. వెయ్యి మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 28 ఏళ్ల విచారణానంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించారు. 


Updated Date - 2020-09-30T17:56:42+05:30 IST