ఏపీలో జడ్జి రామకృష్ణ అరెస్టు

ABN , First Publish Date - 2021-04-16T09:13:59+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు

ఏపీలో జడ్జి రామకృష్ణ అరెస్టు

పీలేరు, ఏప్రిల్‌ 15: ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఆయనను పీలేరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ నెల 28 వరకూ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో పీలేరు సబ్‌ జైలుకు తరలించారు. కేవీ పల్లె మండలానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ జి.జయరామచంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసు స్టేషన్‌లో బుధవారం జడ్జి రామకృష్ణపై కేసు నమోదైంది.  

Updated Date - 2021-04-16T09:13:59+05:30 IST