Jul 1 2021 @ 01:02AM

మధ్యవర్తిగా న్యాయమూర్తి

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ సినిమా చిత్రీకరణ విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, దర్శకుడు శంకర్‌కు మధ్యన తలెత్తిన వివాదం న్యాయస్థానానికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది. బుధవారం కేసు విచారించిన మద్రాస్‌ హైకోర్టు సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిగా విశ్రాంత న్యాయమూర్తి భానుమతిని నియమించింది. ఇరువర్గాలు ఆమోదయోగ్యమైన పరిష్కారంతో రావాలని సూచించింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ ఓ చిత్రం రూపొందిస్తున్నారు. అలాగే రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా ‘అపరిచితుడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అయితే ‘భారతీయుడు 2’ చిత్రీకరణ పూర్తయ్యేదాకా శంకర్‌ మరే సినిమా షూటింగ్‌ మొదలుపెట్టకుండా స్టే ఇవ్వాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.