హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని రెస్టారెంట్లో దారుణం జరిగింది. లేడీస్ టాయిలెట్లో హౌస్ కీపింగ్ బాయ్ ఫోన్ పెట్టి రికార్డ్ చేశాడు. టాయ్లెట్లో సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హౌస్ కీపింగ్ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 4 గంటలు పాటు రికార్డింగ్ అయినట్లు పోలీసులు గుర్తించారు.