జూబ్లీహిల్స్‌ సొసైటీపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత..!?

ABN , First Publish Date - 2021-07-27T12:58:53+05:30 IST

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీపై వస్తున్న అవినీతి ఆరోపణల్లో

జూబ్లీహిల్స్‌ సొసైటీపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత..!?

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీపై వస్తున్న అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ పాలక మండలి తెలిపింది. కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలక మండలి అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ సొసైటీ ఏర్పడిన తరువాత 2005జనరల్‌ బాడీ తీర్మానం ప్రకారం ప్రభుత్వ ధరకు స్టేబిట్‌లను కేటాయించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ బై లాస్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 78 ప్లాట్‌ నెంబరు 254-3లో ఉన్న 365 గజాల స్టే బిట్‌ను పార్వతమ్మకు అప్పగించినట్టు చెప్పారు. ఈ స్థలం జీహెచ్‌ఎంసీ వారిది అనడంలో వాస్తవం లేదన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేయలేదని, కాని కొత్త కమిటీ చేస్తున్న మంచి పనులు నచ్చక కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 


విచారణ ప్రారంభించిన పోలీసులు.. 

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ పాలక మండలిపై నమోదైన కేసు విషయంలో జూబ్లీహిల్స్‌  పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదుదారుడు సురేష్‌ సోమవారం ఇచ్చిన పలు ఆధారాలను పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-27T12:58:53+05:30 IST