జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు

ABN , First Publish Date - 2022-03-20T02:35:20+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిని జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు

హైదరాబాద్‌: నగరంలో సంచలనం సృష్టించిని జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పురోగతి సాధించినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్  తెలిపారు. ప్రమాదం సమయంలో కారును అఫ్రాన్ నడిపినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. 17న 8 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారన్నారు. రెండేళ్ల బాబు చనిపోయాడన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించామన్నారు. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలో కారు ఢీకొందన్నారు. ప్రమాదానికి కారణమైయిన వాహనాన్ని సీజ్ చేసామన్నారు. ప్రమాదం సమయంలో కారు ఎవరు నడిపారు అని భిన్న కోణంలో దర్యాప్తు చేసామని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేసామని, వంద కెమెరాలు జల్లెడ పట్టామన్నారు. ప్రమాద సమయంలో అఫ్రాన్, రహీల్, మహమ్మద్ మాజ్  అనే ముగ్గురు వ్యక్తులు  కారులో ఉన్నారని ఆయన తెలిపారు.మెక్ డోనాల్డ్‌లో తిని జూబ్లీహిల్స్ రోడ్ 45 వైపు వారు వచ్చారన్నారు. ప్రమాద సమయంలో అఫ్రాన్ వెహికల్ నడిపాడన్నారు. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసామన్నారు.  అఫ్రాన్ ఫింగర్స్ ప్రింట్స్‌తో సరిపోయాయన్నారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసామని ఆయన తెలిపారు. కారు నడిపింది ఎవరు అని తెలుసుకోవడానికే ఇంత టైం పట్టిందని ఆయన పేర్కొన్నారు. అక్కడి సాక్షులు డ్రైవర్‌ను గుర్తించారన్నారు. డ్రైవర్ ఏ డైరెక్షన్‌లో పారిపోయాడో ఆ డైరెక్షన్ ఫోన్ సిగ్నల్స్‌ను చెక్ చేశామన్నారు. దీంతో అఫ్రాన్ కారు డ్రైవ్ చేసినట్టు కన్ఫర్మ్ చేసుకున్నామన్నారు. 


బాధితులు ఎక్కడికో వెళ్లారో తమకు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. బిల్లు కట్టే వారు ఎవరూ లేకపోవడంతో బాధితులను అపోలో ఆసుపత్రి నుంచి నిమ్స్  ఆసుపత్రికి తరలించామన్నారు. బాబు డెడ్ బాడీని బాధితులు తీసుకుని ఊరికి వెళ్లిపోయారని ఆయన తెలిపారు. రహీల్ ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. తానే డ్రైవ్ చేసానని అఫ్రాన్ చెప్పాడన్నారు. విచారణలో అది నిజమని తేలిందన్నారు. అఫ్రాన్ డ్రైవ్ చేస్తుంటే, పక్కన రాహెల్ కూర్చున్నాడని ఆయన తెలిపారు. అఫ్రాన్‌ను అదుపులోకి తీసుకుని, మిగతా ఇద్దరిని పంపించేసామన్నారు.  కేసుకు అవసరం ఉన్న ఆరుగురి స్టేట్మెంట్ తీసుకున్నామని ఆయన తెలిపారు. నగరంలో వాహనాలకు బ్లాక్ ఫిల్మ్, స్టిక్కర్స్ పై ప్రత్యేక డ్రైవ్ పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-20T02:35:20+05:30 IST