ఘనంగా గుర్రం జాషువా జయంతి

ABN , First Publish Date - 2021-09-29T06:35:12+05:30 IST

సమాజంలోని అసమానతలను తన సాహిత్యం ద్వారా ప్రశ్నించిన మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

ఘనంగా గుర్రం జాషువా జయంతి
జాషువా విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, తదితరులు

నివాళులర్పించిన మంత్రి ముత్తంశెట్టి, తదితరులు

బీచ్‌రోడ్డు, సెప్టెంబరు 28: సమాజంలోని అసమానతలను తన సాహిత్యం ద్వారా ప్రశ్నించిన మహాకవి గుర్రం జాషువా అని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జాషువా జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం బీచ్‌ రోడ్డులోని ఆయన విగ్రహనికి, చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రితో పాటు ఇతర నాయకులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిన్నతనంలో జాషువా పేదరికంతో పాటు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని, అందుకే సమాజంలో పేరుకుపోయిన వివక్షను తన సాహిత్యం ద్వారా నిలదీశారన్నారు. జాషువా రాసిన కావ్యాలు నేడు విద్యార్థులకు పాఠాంశాలుగా ఉండడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, జేసీ అరుణ్‌బాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, వంగపండు ఉష, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-29T06:35:12+05:30 IST