జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసు..వామ్మో..! సాక్ష్యమా..?

ABN , First Publish Date - 2022-06-17T10:52:40+05:30 IST

దేశ వ్యాప్తం గా సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో సాక్షులు వెనకడుగు వేస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసు..వామ్మో..! సాక్ష్యమా..?

  • వెనకడుగు వేస్తున్న సాక్షులు.. ప్రత్యామ్నాయాలపై పోలీసుల వేట
  • నిందితులంతా లైంగిక సామర్థ్యం ఉన్నవారే
  • పొటెన్సీ పరీక్ష నివేదిక ఇచ్చిన వైద్యులు
  • బెయిల్‌ కోసం నిందితుల ప్రయత్నాలు


బంజారాహిల్స్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తం గా సంచలనం రేపిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో సాక్షులు వెనకడుగు వేస్తున్నారు. వీవీఐపీల పిల్లలు నిం దితులుగా ఉండడం.. ఈ ఘటనపై విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియ్‌సగా తీసుకున్నా రు. మైనర్లకు కూడా పెద్ద శిక్షలు పడేలా పకడ్బందీగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అయితే.. ఘటనపై అవగాన ఉండి.. ఆ సమయంలో పబ్‌, బేకరీల వద్ద ఉన్న వారు సాక్ష్యం చెప్పేందుకు వెనుకంజ వేస్తున్నారని పోలీసులు తెలిపారు. రిమాండ్‌ రిపోర్టులో ఇప్పటికే 12 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్న పోలీసులు .. వారి పేర్లను, వివరాలను కోర్టుకు అందజేశారు. వారిలో.. బాలిక తల్లిదండ్రులు, సోదరుడు, బాలికను పబ్‌కు తీసుకెళ్లిన వ్యక్తి, పబ్‌ నిర్వాహకుల్లో ఇద్దరు, ఓ బౌన్సర్‌, ఓ కాపలాదారు, బేకరీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కేసుకు మరింత బలం చేకూరేలా పబ్‌లో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వారు.. నిందితులతో సన్నిహితంగా మెలిగినవారిని కూడా సాక్ష్యులుగా చేర్చాలని పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ‘‘నేను సాక్ష్యం చెబితే పబ్‌కు వెళ్తాననే విషయం అందరికీ తెలుస్తుంది’’ అంటూ ఓ అమ్మాయి సున్నితంగా చెప్పినట్లు పోలీసులు వివరించారు. పబ్‌లో ఉన్న మరికొందరు కూడా.. ‘‘ఆ రోజు.. ఆ సమయానికి అ క్కడున్న విషయం నిజమే. 


కానీ, వామ్మో.. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేం’’ అంటే నిర్మొహమాటంగా చెప్పారన్నారు. దీంతో.. పోలీసులు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీలు సాంకేతిక ఆధారాలుగా ఉన్నాయి. ఫోరెన్సిక్‌ నివేదికే ఇప్పుడు అత్యంత కీలకమని ఓ అధికారి చెప్పారు. ‘‘సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌టవర్‌ లొకేషన్‌ల ఆధారంగా ఇప్పటికే నిందితులంతా పబ్‌ నుంచి బేకరీకి.. అక్కడి నుంచి పెద్దమ్మగుడికి వెనకవైపు ఉన్న ప్రాంతానికి వెళ్లినట్లు తేలింది. బాలికపై అత్యాచారానికి ఉపయోగించిన ఇన్నోవా వాహనంలో లభించిన తల వెంట్రుకల ను సేకరించాం. అత్యాచారం జరిపాక.. నిందితులు మరకలను టిష్యూ పేపర్లతో తు డుచుకున్నారు. కారులో వీర్యం తాలూకు ఆధారాలు కూడా లభించాయి. వేలిముద్రలను సేకరించాం. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్‌ నివేదికే నిందితులకు వ్యతిరేకం గా పక్కా ఆధారంగా ఉండనుంది’’ అని ఆయన వివరించారు. దీనికి తోడు.. నిందితుల ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ కూడా కీలకమని మరో అధికారి చెప్పారు. ‘‘ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ అంటే..  నిందితులతో పాటు  మరో పదిమంది ఉంటారు. వారిలో నిందితుడిని బాధితురాలు గుర్తించాలి. ఇది  పెద్ద ప్రక్రియే’’ అని తెలిపారు. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ సహా.. ఐదుగురు మైనర్ల తరఫు వారు బెయిల్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సాదుద్దీన్‌ ట్రయల్‌ కోర్టులో.. మైనర్ల తరఫున జువెనైల్‌ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే.. పోలీసులు వారికి బెయిల్‌ రాకుండా శక్తిమంతమైన కౌంటర్‌ వేసేలా న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. చార్జ్‌షీట్‌ విషయంలోనూ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్లు చెప్పారు. 


పోలీసుల చేతికి పొటెన్సీ టెస్టు రిపోర్టు

ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ సహా.. ఐదుగురు మైనర్‌లకు సంబంధించిన పొటెన్సీ పరీక్ష నివేదిక పోలీసుల చేతికి అందింది. వారు లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఉస్మానియా ఫోరెన్సిక్‌ వైద్యు లు నిర్ధారించారు. దాంతో ఆ రిపోర్టును చార్జ్‌షీట్‌లో పొందుపర్చనున్నారు.

Updated Date - 2022-06-17T10:52:40+05:30 IST