Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 26 Mar 2020 22:01:40 IST

బర్త్‌డే రోజు చరణ్‌ని సర్‌ప్రైజ్ చేయబోతోన్న ఎన్టీఆర్

twitter-iconwatsapp-iconfb-icon

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్ర టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ని ఉగాది పర్వదినాన విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌‌కు మంచి స్పందన రావడమే కాకుండా ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ నుంచి మరో సర్‌ప్రైజ్ రాబోతోంది. ఈ సర్‌ప్రైజ్ ఎవరు ఇవ్వబోతున్నారో తెలుసా? ఇంకెవరు కొమరం భీం పాత్ర చేస్తున్న యంగ్ టైగర్. పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోతో తన మిత్రుడు రామరాజును సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లుగా ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ప్రకటించారు. 


‘‘నీ బర్త్‌డే‌ని దగ్గరుండి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే అందరం లాక్‌డౌన్‌లో ఉన్నాం. అందరం ఇంటిపట్టునే ఉండటం ఇప్పుడు ముఖ్యం. అయితేనేం శుక్రవారం ఉదయం 10 గంటలకు డిజిటల్‌గా నిన్ను సర్‌ప్రైజ్ చేస్తా. నన్ను నమ్ము. నేను ఇచ్చే సర్‌ప్రైజ్ నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేదిగా ఉంటుంది.. ’’ అంటూ రామరాజు కోసం భీం అని ఎన్టీఆర్ ట్యాగ్ చేశారు.


దీనికి రామరాజు అదే రామ్ చరణ్.. ‘‘వావ్.. నేను కరెక్ట్ టైమ్‌లో ట్విట్టర్‌లోకి వచ్చానని అనుకుంటున్నా. లేదంటే నువ్వు ఇచ్చే సర్‌ప్రైజ్ మిస్ అయ్యేవాడిని బ్రదర్. సర్‌ప్రైజ్ కోసం రేపటి వరకు ఆగలేకపోతున్నాను..’’ అని స్పందించారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement