Jul 27 2021 @ 17:45PM

రాజమౌళితో తారక్‌ ఆట!

కరోనా వల్ల ఆటంకం కలిగి ఆగిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ను మళ్లీ సెట్‌ మీదకు తీసుకెళ్లారు రాజమౌళి. వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆగస్ట్‌ మొదటివారంలో తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిత్యం షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉండే రాజమౌళి టీమ్‌ కాస్త విరామం దొరకడంతో వాలీబాల్‌ ఆడారు. అటు పక్క టీమ్‌లో రాజమౌళి, ఇటు పక్క టీమ్‌లో తారక్‌ ఆడుతున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. గతంలో ఓ కాజ్‌ కోసం క్రికెట్‌ ఆడిన తారక్‌ చాలా కాలం తర్వాత ఇలా వాలీబాల్‌ ఆడుతూ కనిపించారు. ఆసక్తికరంగా ఉన్న వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు.