Abn logo
Mar 26 2020 @ 19:02PM

రూ. 75 లక్షలు ప్రకటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మహేష్ బాబు, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్ రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి ప్రముఖులెందరో ఇప్పటికే తమ వంత సాయం ప్రకటించారు.  తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. 


ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌జేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement