పంజాబ్ బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం

ABN , First Publish Date - 2021-07-17T22:26:48+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ జాతీయ..

పంజాబ్ బీజేపీ నేతలకు నడ్డా దిశానిర్దేశం

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు చేరువకావాలనీ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ సహా విపక్ష పార్టీల తీరును ఎండగట్టాలని సూచించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారంనాడు పంజాబ్ బీజేపీ నేతలతో జేడీ నడ్డా సమావేశమయ్యారు. పార్టీ పంజాబ్ యూనిట్ చీఫ్ అశ్విని కుమార్ శర్మ, పార్టీ జనరల్ సెక్రటరీ దినేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.


మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సైతం పంజాబ్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభ నివారణలో శుక్రవారంనాడు తలమునకలైంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి సంస్థాగత మార్పులు చేయాలని నిర్ణయించింది. పార్టీ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా సిద్ధూను, నలుగురు వర్కింగ్ ప్రెసిండెట్లను నియమించాలని నిర్ణయించిందని, దీనిపై అధికారిక ప్రకటన చేయడమే తరువాయి అని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-07-17T22:26:48+05:30 IST