పెగాసస్‌పై సుప్రీంకు జర్నలిస్టులు

ABN , First Publish Date - 2021-07-28T08:16:59+05:30 IST

పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా దేశంలో రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్‌ చేసిన వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశా రు.

పెగాసస్‌పై సుప్రీంకు జర్నలిస్టులు

  • స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని అభ్యర్థన
  • ఫోన్ల హ్యాకింగ్‌.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే
  • పిటిషన్‌లో జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ 
  • పెగాసస్‌ వ్యవహారంపై అధికారులను ప్రశ్నిస్తాం
  • ఐటీ పార్లమెంటరీ ప్యానల్‌ భేటీలో ఇదే ప్రధానాంశం
  • కమిటీ చైర్మన్‌ శశి థరూర్‌ వెల్లడి.. నేడు సమావేశం


న్యూఢిల్లీ, జూలై 27: పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా దేశంలో రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్‌ చేసిన వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో సీనియర్‌ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశా రు. సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జితోగానీ, రిటైర్డ్‌ జడ్జితోగానీ దర్యాప్తున కు ఆదేశించాలని కోరారు. ఫోన్లపై నిఘా పెట్టేలా పెగాస్‌సకు ప్రభు త్వం గానీ, ప్రభుత్వ సంస్థగానీ లైసెన్సు ఇచ్చిందేమో వెల్లడించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును వారు అభ్యర్థించారు.


జర్నలిస్టులు, న్యాయవాదులు, మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు సహా 142 మందికి పైగా భారతీయుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైనట్లుగా ప్రపంచంలోని పలు ప్రసార సంస్థలు వెల్లడించాయని తెలిపారు. భద్రతా నిబంధనలన్నింటినీ పెగాసస్‌ ఉల్లంఘించినట్లుగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్‌ కూడా ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరిపిందని గుర్తు చేశారు. పెగాసస్‌ చర్చ శిక్షార్షమైనదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పెగాసస్‌ వ్యవహారంపై ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ, ఐటీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ శశి థరూర్‌ తెలిపారు.

Updated Date - 2021-07-28T08:16:59+05:30 IST