సమాజ మార్పులో జర్నలిస్టులది ప్రముఖపాత్ర

ABN , First Publish Date - 2022-07-04T04:36:24+05:30 IST

సమాజ మార్పులో జర్నలిస్టులది ప్రముఖ పాత్ర అని, పాలమూరు అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

సమాజ మార్పులో జర్నలిస్టులది ప్రముఖపాత్ర
జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్న మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌, జూలై 3 : సమాజ మార్పులో జర్నలిస్టులది ప్రముఖ పాత్ర అని, పాలమూరు అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జరుగుతున్న అభివృద్ధిని ఉన్నది ఉన్నట్లు చూయించాలని, తప్పు జరుగుతున్నా అధికారుల దృష్టికి, తన దృష్టికి తీసుకు వచ్చే బాధ్యత మీపై ఉందని జర్నలిస్టులకు సూచించారు. ఆదివారం కేసీఆర్‌ అర్బన్‌ ఎకోపార్క్‌లో జర్నలిస్టులకు మంత్రి అక్రిడిటేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. అక్రిడిటేషన్‌ ఉన్న అందరికీ ఇల్లు, ఏదోరకమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, డీపీఆర్‌వో వెంకటేశ్వర్లు, అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు బస్వరాజు, గోవర్ధన్‌గౌడ్‌, బండి విజయ్‌కుమార్‌, దత్తేందర్‌, వెంకటేశ్‌, శ్రీనివాసులు, సిద్దిఖి, తాటికొండ కృష్ణ, జర్నలిస్టులు పాల్గొన్నారు. 

జిల్లా సమగ్ర  స్వరూప గ్రంథం ఆవిష్కరణ

మహబూబ్‌నగర్‌ టౌన్‌ : తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యం లో జిల్లా ఉత్సవం పేరుతో  రూపొందించిన మహబూబ్‌నగర్‌ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆవిష్కరించారు. ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశమందిరం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాలమూరు వైభవంపై కవులు కవిత్వాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర సాహిత్య పరిషత్‌ చైర్మన్‌ డా.ఎల్లూరి శివారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, మనోహర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి నర్సింహులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌. ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, బాద్మి శివకుమార్‌, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, భీంపల్లి శ్రీకాంత్‌ పాటు జిల్లా ప్రముఖులు, రచయితలు, కవయిత్రులు, సాహిత్య వేత్తలు, మేధావులు పాల్గొన్నారు. అనంతరం పాలమూరు యూనివర్సిటీ తెలుగు విభాగాధిపతి మనేమోని కృష్ణయ్యను సన్మానించారు.

Updated Date - 2022-07-04T04:36:24+05:30 IST