కరోనాతో జర్నలిస్టు మృతి

ABN , First Publish Date - 2021-04-11T05:13:22+05:30 IST

పలాస-కాశీబుగ్గకు చెందిన ఓ జర్నలిస్టు కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పదిరోజుల కిందట ఆయన కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు.

కరోనాతో జర్నలిస్టు మృతి
మంత్రి అప్పలరాజుకు వినతిపత్రం అందిస్తున్న ప్రెస్‌క్లబ్‌ సభ్యులు

ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ వినతి

పలాస : పలాస-కాశీబుగ్గకు చెందిన ఓ జర్నలిస్టు కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పదిరోజుల కిందట ఆయన కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స నిమిత్తం చేరాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.  శ్రీకాకుళంలోనే ప్రభుత్వలాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలాస- కాశీబుగ్గ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రి అప్పలరాజుకు శనివారం వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘ నాయకులు మహరణ, హరి, రాము తదితరులు పాల్గొన్నారు. కాగా మునిసిపల్‌ మాజీ  చైర్మన్‌ వజ్జ బాబూరావు  ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు జర్నలిస్టు మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్‌, మాజీ వైస్‌చైర్మన్‌ గురిటి సూర్య నారాయణ, మాజీ ఎంపీపీ బత్తిన హేమేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-11T05:13:22+05:30 IST